జైలు నుంచే కేజ్రీవాల్ పాలన ... తొలి ఆదేశం జారీ

జైలు నుంచే కేజ్రీవాల్ పాలన ... తొలి ఆదేశం జారీ

ముద్ర,సెంట్రల్ డెస్క్:- లిక్కర్ స్కాం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.ఈ మేరకు ఈడీ కస్టడీ నుంచి దిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన తొలి ఉత్తర్వును ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జారీ చేశారు.సీఎం కేజ్రీవాల్ ఒక నోట్ ద్వారా జలవనరుల శాఖకు ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో ఆప్ నేత, మంత్రి అతిషి ఆదివారం విలేఖరుల సమావేశం నిర్వహించి, సీఎం కేజ్రీవాల్ ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు.