నిరుపేదలకు అండగా నిలువనున్న కాంగ్రెస్ పార్టీ

నిరుపేదలకు అండగా నిలువనున్న కాంగ్రెస్ పార్టీ
  • కేశంపేట మండల కాంగ్రెస్ ఇంచార్జీ ఇబ్రహీం

ముద్ర/కేశంపేట: కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇస్తే నిరుపేదలకు అండగా నిలుస్తుందని కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మహమ్మద్ ఇబ్రహీం అన్నారు. మంగళవారం మండల పరిధిలోని నిర్ద వెళ్లి గ్రామంలో పార్లమెంట్ అభ్యర్థి చల్ల వంశీ చంద్ రెడ్డి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తో బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసేందుకు అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుందని వివరించారు. హస్తం పేద ప్రజలకు నేస్తంగా నిలుస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల గురించి వివరించారు .రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడానికి కృషి చేస్తున్నారని వివరించారు. టిఆర్ఎస్, బిజెపి మాటలను ప్రజలు ఎవరు నమ్మవద్దని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలోఎంపీటీసీ సురేష్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు జంగయ్య , కొత్త శ్రీశైలం, ఆమేర్ , ముత్యాలు , ఖాజా , నందు ,  బాలు , రమేష్ , రామకృష్ణ , రాజేందర్ , షాబుద్ధిన్ , మజహర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.