ఖానాపూర్ మున్సిపాలిటీ అవిశ్వాసం రాసా బాస..

ఖానాపూర్ మున్సిపాలిటీ అవిశ్వాసం రాసా బాస..
  • కోర్టు ఉత్తర్వులతో నిలిచిన పక్రియ
  • మండిపడిన కౌన్సిలర్లు.

ఖానాపూర్, ముద్ర : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ లో శుక్రవారం జరగవలసిన అవిశ్వాసం కోర్టు ఉత్తర్వులతో నిలిచిపోయి రాసా బాసగా మారింది. 9 మంది కౌన్సిలర్లు కలిసి చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్ పైన కొద్ది రోజుల క్రితం అవిశ్వాసం పెట్టారు. జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం అందజేశారు. ఈ క్రమంలో నిర్మల్ ఆర్డివో రత్నకళ్యాణి గత నెల 14 న ఖానాపూర్ మునిసిపల్ కు వచ్చి విచారణ చేసి రికార్డులు పరిశీలించారు. అదే రోజు జనవరి 5 న  అవిశ్వాసం ఉంటుందని, బలనిరూపణ చేసుకోవాలని ప్రకటించారు. అయితే శుక్రవారం అవిశ్వాసం కు వచ్చిన కౌన్సిలర్లకు ఆర్డీవో షాక్ ఇచ్చారు. శుక్రవారం ఉదయం మునిసిపల్ కార్యాలయం కు అవిశ్వాసంలో పాల్గొనేందుకు 9 మంది కౌన్సిలర్లు వచ్చారు. ఈ సందర్బంగా ఆర్డీవో రత్నకళ్యాణి మాట్లాడుతూ, కోర్టు ఉత్తర్వుల రావటం వలన అవిశ్వాసం పక్రియను తాత్కాలికoగా నిలిపివేయటం జరిగిందని చెప్పారు. దీనితో కౌన్సిలర్లు కంగు తిన్నారు. అవిశ్వాసం నిలిచిపోవటానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఆర్డీవో కారులో వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేయగా, కౌన్సిలర్లు అడ్డుకొని ఆందోళన చేశారు. కోర్టు ఉత్తర్వులు వచ్చినట్లు ఒక రోజు ముందుగా చెపితే తాము ఇక్కడికి వచ్చే వారిమి కాదని అన్నారు. అధికారులు లాలూచి పడ్డారని ఆరోపించారు. అధికారుల తప్పిదం ఉందని మండిపడ్డారు.

వెనక్కి తగ్గేది లేదు.. అవిశ్వాసం ఉంటుంది.

ఆర్డీవో కారుకు అడ్డుకొని నిలదీస్తున్న కౌన్సిలర్లు
మాట్లాడుతున్న చైర్మన్ పదవి ఆశిస్తున్నా రాజుర సత్యం
ఆందోళన చేస్తున్న కౌన్సిలర్లు

తాము వెనక్కి తగ్గేది లేదని, అవిశ్వాసం ఎట్టి పరిస్థితిలో ఉంటుందని మున్సిపాలిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజుర సత్యం, కౌన్సిలర్లు స్పష్టం చేశారు. మున్సిపాలిటీ లో 4 సంవత్సరంలలో అవినీతి చోటు చేసుకుందని, అందుకే పార్టీలకతీతంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు 9 మంది కలిసి అవిశ్వాసం పెట్టటం జరిగిందని, కొందరు కుట్రలు చేస్తూ అడ్డుకోవాలని చూస్తున్నారని, ఒక్క రోజైన అవిశ్వాసం పెట్టి, అవినీతిని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.