6న ఇండియా కూటమి సమావేశానికి ఖర్గే పిలుపు

6న ఇండియా కూటమి సమావేశానికి ఖర్గే పిలుపు

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం డిసెంబర్ 6న కాంగ్రెస్ భారత కూటమి సమావేశానికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీలో భారత కూటమి పార్టీలతో సమావేశం కానున్నారు. ఐదు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్​ వెనుకబడింది. దీంతో కూటమి సమావేశ ప్రకటనను ఆదివారం వెల్లడించారు. ఈ సమావేశంలో ఆయా రాష్ర్టాల్లో సీట్ల పంపకాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ర్టాల్లో కాంగ్రెస్​ బోల్తా పడినా, తెలంగాణలో గెలుపు దిశగా దూసుకుపోతుంది. కూటమి మొదటి సమావేశం పాట్నాలో జరగ్గా, రెండో సమావేశం బెంగుళూరులో, మూడో సమావేశం ముంబైలో, నాలుగో సమావేశం ఢిల్లీలో జరిగిన విషయం తెలిసిందే.