తెలంగాణ సామాజిక రచయితల సంఘం నల్గొండ జిల్లా కన్వీనర్ గా బొమ్మరగోని కిరణ్ ఫిషర్ నియామకం 

తెలంగాణ సామాజిక రచయితల సంఘం నల్గొండ జిల్లా కన్వీనర్ గా బొమ్మరగోని కిరణ్ ఫిషర్ నియామకం 

చండూరు, ముద్ర:తెలంగాణ సామాజిక రచయితల సంఘం నల్లగొండ జిల్లా కన్వీనర్ గా చండూరు మండలం నేర్మట గ్రామానికి చెందిన న్యాయవాది కవి,రచయిత అయిన బొమ్మ రగోని కిరణ్ ఫిషర్ ను నియామకం చేసినట్లు తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామిడీ సతీష్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశము ఒక ప్రకటనలో తెలిపారు, ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా పత్రికా రంగంలో రాణిస్తూ వివిధ పత్రికలకు సంచిక లకు మారుపేరైన శీర్షికలు, వ్యాసాలు రాస్తూ అందరి ఆదరాభిమానాలు చూరగొoటున్న రచయిత,కిరణ్ యొక్క ప్రతిభను గుర్తించి నల్లగొండ జిల్లాకు కన్వీనర్ గా నియామకం చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కామిడీ సతీష్ రెడ్డి తెలిపారు, సమాజానికి దిక్సూచి రచయితలేనని సామాజిక అంశాలపై రచయితలు దృష్టి పెట్టి సంచలనాత్మక అంశాలను రాసి, పాఠకుల హృదయాలను దోచుకోవాలని, సమాజ మార్పు తేవడానికి కృషి చేయాలని తెలిపారు,  ఈ సందర్భంగా కిరణ్ ఫిషర్ మాట్లాడుతూ తనను నియామకం చేసిన రాష్ట్ర అధ్యక్షులు సతీష్ రెడ్డికి ప్రధాన కార్యదర్శి రాజేశము కు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.