కోదాడ నూతన డిఎస్పీ శ్రీధర్ రెడ్డి

కోదాడ నూతన డిఎస్పీ శ్రీధర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి , కోదాడ:- కోదాడ నూతన డిఎస్పీ గా మామిళ్ల శ్రీధర్ రెడ్డి నియమితులయ్యారు , ఈ మేరకు సోమవారం రాత్రి డిజిపి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు . ప్రస్తుతం నల్లగొండ లో డిఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ రెడ్డి ఒకటి , రెండు రోజులలో కోదాడ డిఎస్పీ గా బాధ్యతలు స్వీకరించనున్నారు . ప్రస్తుతం కోదాడ డిఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న ప్రకాష్ ను ఆదిలాబాద్ పిటిసి కి బదిలీ చేశారు . కోదాడ డిఎస్పీ గా నియమితులైన ఎం శ్రీధర్ రెడ్డి గతంలో కోదాడ రురల్ ఎస్సై గా , పట్టణ సిఐ గా విధులు నిర్వహించారు . కోదాడ డిఎస్పీ గా శ్రీధర్ రెడ్డి నియామకం పట్ల ఐజేయూ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గింజల అప్పిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు .