గుండెపోటుతో కొదురుపాక గ్రామ వాసి
మృతి ముద్ర, బోయినిపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన ఉప్పులేటి హన్మయ్య (70) గుండెపోటుతో మరణించారు. వివరాల్లోకి వెలితే ఆరోగ్యం బాగాలేక కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్దామని తన కొడుకు కోదురుపాక బస్టాండ్ వద్ద రాత్రి బస్ కొరకు చూస్తుండగా ఒక్కసారిగ హన్మయ్య కుప్పకూలిపోయాడు.అక్కడే ఉన్న చెక్ పోస్ట్ వద్ద ఉన్న పోలీస్ సిబ్బంది శ్రీధర్, నరేష్ నాయక్, గంగరాం, సిబ్బంది గుండె పోటుకి గురైన వ్యక్తికి సి.పి.అర్ చేయగా శ్వాస తీసుకోవడంతో ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి పంపించగా,మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మృతునికి భార్య ముగ్గురు కొడుకులు ఉన్నారు.