మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శిగా కోల నాగేశ్వరరావు. 

మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శిగా కోల నాగేశ్వరరావు. 
  • రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్. 

హుజూర్ నగర్ టౌన్, ముద్ర:-మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శిగా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కోల నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాదులో మున్నూరు కాపు సంఘం ప్లీనరీ నిర్వహించగా  సోమవారం హైదరాబాద్ లో ని రాష్ట్ర కార్యాలయంలో  మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ కోల నాగేశ్వరరావు నియామక పత్రం అందజేశారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపుల అభివృద్ధికి దశాబ్దాలుగా కృషి చేస్తున్నాడని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుంటూ అభివృద్ధి వైపు పైనించాలన్నారు. రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శిగా ఎన్నికైన కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాపుల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా అన్నారు. గతంలో రాష్ట్ర కార్యదర్శిగా, ప్రస్తుతం రెండోసారి కార్యనిర్వాక కార్యదర్శిగా అవకాశం కల్పించిన కొండా దేవన్నకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో  రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లేపల్లి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు తుమ్రుగోటి కార్తీక్, మహేందర్ నాయుడు,రాము, వెంకటేశు  పాల్గొన్నారు.