గుండెపోటుతో కొత్తపేట తాజా మాజీ సర్పంచ్ మృతి 

గుండెపోటుతో కొత్తపేట తాజా మాజీ సర్పంచ్ మృతి 
  • పరామర్శించిన ఎంపీపీ,కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీల నాయకులు

ముద్ర,పానుగల్:- పానుగల్ మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ గద్వాల రమేష్ (38) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. మృతుడికి భార్య లక్ష్మి కుమారుడు కూతురు ఉన్నారు.మాజీ సర్పంచ్ గుండెపోటుతో మృతి చెందిన వార్త తెలుసుకొని ఎంపీపీ మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డి, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు,కాంట్రాక్టర్ తిరుపతయ్య సాగర్,మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు మాజీ జెడ్పిటిసి రవికుమార్, మాజీ సర్పంచులు సింగిరెడ్డి గోపాల్ రెడ్డి,నగేష్ నాయుడు,శ్రీనివాస్ రెడ్డి, వెంకటయ్య యాదవ్,అంజి,కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్ సాగర్,లోకారెడ్డి,నరేందర్ గౌడ్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతయ్య నాయుడు,మాజీ ఎంపీటీసీ రాంచందర్ యాదవ్,భాస్కర్ రెడ్డి, రాంబాబు నాయక్,భాస్కర్,నవీన్ తదితరులు పరామర్శించారు.