ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తున్న కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు

ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తున్న కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు

(కేసముద్రం- ముద్ర) ఆదిలాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి ఆదిలాబాద్ కు ప్రతిరోజు వెళ్లే కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు గత కొద్ది రోజులుగా గంటల తరబడి ఆలస్యంగా నడుస్తోంది. శనివారం ఆదిలాబాద్ నుంచి తిరుపతి వైపు వెళ్లే కృష్ణ ఎక్స్ప్రెస్ కేసముద్రం రైల్వే స్టేషన్ కు ఉదయం 9:11 గంటలకు రావాల్సి ఉండగా, నుంచి దాదాపు 5 గంటల ఆలస్యంగా మధ్యాహ్నం 2:15 గంటలకు వచ్చింది. ఇదిలా ఉంటే తిరుపతి నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్లే కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు గత వారం రోజులుగా గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే ఆదిలాబాద్ నుంచి తిరుపతి వైపు వెళ్లే కృష్ణ ఎక్స్ప్రెస్ అరగంట నుంచి గంట ఆలస్యంగా నడుస్తుండగా శనివారం ఏకంగా ఐదు గంటలు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి తిరుపతి వెళ్లే భక్తులు కృష్ణ ఎక్స్ప్రెస్ ఆలస్యంగా నడవడంతో తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ చోట్ల రైల్వే ట్రాక్ మరమ్మత్తుల కారణంగా రైళ్ల ఆలస్యానికి కారణంగా మారిందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.