కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్పోరేటు మతతత్వ విధానాలను ప్రతిఘటిద్దాం

కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్పోరేటు మతతత్వ విధానాలను ప్రతిఘటిద్దాం
  • భవన నిర్మాణ,వలస కార్మికుల చట్టాలను రక్షించుకుందాం
  • బిజెపి కో హటావో- దేశ్ కో బచావో నినాదంతో ఫిబ్రవరి 16న కార్మిక సమ్మె
  • సిఐటియు జిల్లా కార్యదర్శి సూర్యవంశం రాము

ముద్ర,పానుగల్:- పానుగల్ మండలం బుసిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఫిబ్రవరి 16న చేపట్టే సమ్మెకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సూర్యవంశం రాము మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కార్పోరేట్ మతతత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రతిఘటనకు సిద్ధం కావాలని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై చార్ సీటు ప్రకటిస్తూ 2024 ఫిబ్రవరి 16న సమ్మె-గ్రామీణ భారత్ బంద్ విజయవంతం చేయాలని అన్నారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయిన కార్మికుల,రైతుల, సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించకపోగా అనేక  సమస్యలను నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గా అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చిందని,12 గంటల పని విధానం అమలు చేస్తుందని, రద్దు చేసిన చట్టాలలో భవన నిర్మాణ కార్మికుల 1996 చట్టం, వలస కార్మికుల 1979 చట్టం రద్దయిందన్నారు.

దీంతో దేశవ్యాప్తంగా 10 కోట్లు. రాష్ట్రంలో 25 లక్షల నిర్మాణరంగ కార్మికులకు పోరాడి సాధించుకున్న హక్కులు హరించకపోయాయని,1979 అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టం 1996 భవన కార్మికుల,ఇతర నిర్మాణ కార్మికుల సమగ్ర కేంద్ర చట్టాలను రక్షించి, వాటిని పక్కడ్బందీగా అమలు చేయాలన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, భవన నిర్మాణంలో వాడే ఇసుక, ఇటుక ,సిమెంటు, స్టీల్ ,పెయింట్ తదితర ముడి సరుకుల ధరలను నియంత్రించాలన్నారు.అసెంబ్లీలో ప్రకటించిన ఒక లక్ష మోటార్ సైకిళ్లను కార్మికులకు వెంటనే ఇవ్వాలని,కార్మిక శాఖలో బ్రోకర్ల వ్యవస్థను నిర్మూలించాలని,అర్హులైన కార్మికులకే నష్టపరిహారాలు అందించాలని,ప్రమాద మరణానికి ప్రశ్నిస్తున్న ఆరు లక్షల గాను పది లక్షలు,సహజ మరణానికి ఇస్తున్న లక్ష రూపాయలను ఐదు లక్షలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక నియంతృత్వ కార్పొరేట్ మతతత్వ అనుకూల విధానాలను దూకుడుగా అమలు చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యమై బిజెపి కో హటావో దేశ్ కు బచావో నినాదంతో ఫిబ్రవరి 16న జరిగే సమ్మె గ్రామీణ భారత్ బందులో భవన నిర్మాణ కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిల్లర్ మేస్త్రి యూనియన్ నాయకులు కురుమయ్య,రాజు,దేవ ఉషన్,మదిలేటి,కుర్మయ్య. నరసింహ తదితరులు పాల్గొన్నారు.