కొండా లక్ష్మణ్ బాపూజీ బాటలో పయనిద్దాం

కొండా లక్ష్మణ్ బాపూజీ బాటలో పయనిద్దాం

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని గెలిపిద్దాం
నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పత్తిపాక సురేష్

ముద్ర ,తంగళ్ళపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరళ్ల గ్రామంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పత్తిపాక సురేష్ గడపగడప ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ తరతరాలుగా పాలకులు ఉన్న వలసదారుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ స్థానికేతరులను ఓడించాలన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనలో వెనుకబడిన తరగతుల అభివృద్ధికై ప్రాంత పాలకుడు కావాలని ఇక్కడ ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తానని సింహం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.