ఎల్లంపల్లి ప్రాజెక్టు పది గేట్లు ఎత్తివేత

ఎల్లంపల్లి ప్రాజెక్టు పది గేట్లు ఎత్తివేత
  • గోదావరిలోకి భారీగా వరద నీరు
  • లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పది గేట్లు ఎత్తి వేశారు. గత రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద నీరు ప్రవాహం పెరిగింది. మరో వైపు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువ గోదావరిలో కి నీరు విడుదల  చేశారు. ప్రాజెక్టు నీటి నిలువ సామర్ధ్యం 20.175 టీ.ఎం.సీ. కాగా శుక్రవారం నాడు ప్రాజెక్టులోకి లక్షా 12 వేల 157 క్యూసెక్కుల నీరు చేరుకుంది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు పది గేట్లను ఎత్తివేసి దిగువ గోదావరిలోకి నీరును విడుదల చేశారు. మధ్యాహ్నం వరకు 51,580 క్యూసెక్కుల నీరును పది గేట్ల ద్వారా విడుదల చేశారు. దిగువ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల వాసులను అధికారులు అప్రమత్తం చేశారు.