అక్రమ నిర్మాణాల కూల్చివేత ....

అక్రమ నిర్మాణాల కూల్చివేత ....
Lions Group illegal venture Demolition

ముద్ర ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా పరిధిలోనీ ఆయా ప్రాంతాలలోవెలిసిన బారీ అక్రమ నిర్మాణాల ను శుక్రవారం అధికారులు కూల్చి వేశారు. శామీర్ పేట మండలం లోని సెలబ్రిటీ క్లబ్ ఆవరణలో అనుమతులు లేకుండా వెలసిన అక్రమ వెంచర్ లోని నిర్మాణాలను నేలమట్టం చేశారు.

అలాగే బాబాగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 537/ఏ లో అక్రమం గా నిర్మించిన గోదాము ను, లాల్ గడి మలక్ పేట గ్రామ పంచాయతీ పరిధిలో ఆ లియన్స్ గ్రూప్ వారి అక్రమ వెంచర్ ను అధికారులు కూల్చి వేశారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి రమణ మూర్తి మాట్లాడుతూ అనుమతులు లేకుండా వెలసిన అక్రమ నిర్మాణాల ను ఏ మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చ రించారు.