మద్యం పట్టివేత

మద్యం పట్టివేత

ముద్ర. వీపనగండ్ల:-అక్రమంగా మద్యాన్ని నిలువ చేసి ఉంచిన వ్యక్తి నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన ఘటన వీపనగండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రవి ప్రకాష్ కథనం ప్రకారం మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన మల్లెమోని మల్లయ్య అనే వ్యక్తి అక్రమంగా 40 వేల రూపాయలు విలువ చేసే మద్యాన్ని నిలువ చేసి ఉంచగా సమాచారం అందుకున్న స్పెషల్ పార్టీ టీం పోలీసులు ఆ వ్యక్తి ఇంటి పై దాడి చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవి ప్రకాష్ తెలిపారు.