లాటరీ పద్దతిలో మద్యం దుకాణాలు 

లాటరీ పద్దతిలో మద్యం దుకాణాలు 

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించారు. మద్యం దుకాణాలకు టెండర్ల ను ఆహ్వానించగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఆయా మద్యం దుకాణాలను లాటరీ పద్దతిలో సోమవారం కేటాయించారు. కాలేజ్ రోడ్ లోని పద్మనాయక ఫంక్షన్ హాలులో మంచిర్యాల జిల్లా పాలనాధికారి బి సంతోష్ పర్యవేక్షణ లో లాటరీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలో 73 మద్యం దుకాణాలకు 2248 దరఖాస్తులు రావడంతో, పారదర్శకంగా మద్యం దుకాణాల విజేతలను ఎంపిక చేశారు. దుకాణాలు వచ్చిన వారు ఆనందంతో పొంగిపోగా రాని వారు నిరుత్సాహం తో ఇంటి ముఖం పట్టారు. దరఖాస్తు రుసుంగా రెండు లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారు. విజేతలకు కేటాయించిన మద్యం దుకాణాల ఫీజును 60 శాతం ముందుగానే చెల్లించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.