ప్రేమ జంట ఆత్మహత్య
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: జిల్లాలోని దోమకొండలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దోమకొండ మండలం అంబర్పేట్ గ్రామానికి చెందిన వీణ(23), కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి(24) కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం సాయి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వీణ కూడా అదేరోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వారి ప్రేమకు పెద్దలు అంగీకరించరని భావించి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఇరు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. తదుపరి విచారణ జరుపుతున్నామని తెలిపారు.