కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తాం

కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తాం
  • రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎండి జబ్బార్

ముద్ర,పానుగల్:- పానుగల్ మండల కేంద్రంలో శుక్రవారం సిఐటియు,రైతు సంఘం,వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్,వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పానుగల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన దేశవ్యాప్త కార్మిక సమ్మె, గ్రామీణ బంధు కార్యక్రమానికి సిఐటియు పానగల్ మండల కన్వీనర్ సూర్యవంశం రాము అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎండి జబ్బార్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి కార్పొరేటు మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని,కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై చార్ సీట్ ప్రకటిస్తూ లక్షలాది కుటుంబాలను ఇంటింటికి వెళ్లి క్యంపియన్ నిర్వహించి దేశవ్యాప్త కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

చారిత్రాత్మకమైన రైతంగ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరహిస్తూ రైతులకు రాతపూర్వకంగా హామీలు ఇచ్చిందని, ఈ కాలంలో వాటిని అమలు చేయక వ్యవసాయ రంగాని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు పూనుకున్నదన్నారు.సహకార రంగాన్ని నిర్వీరం చేసి కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నదని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించలేదని,ఆందోళన సందర్భంగా చనిపోయిన 750 రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని,ఉపా చట్టం పేరుతో రైతు నాయకుల పై అక్రమ కేసులు బనాయించి జైళ్ళలలో పెడుతున్నదన్నారు.వామపక్షాల ఒత్తిడి వల్ల వచ్చిన ఉపాధి హామీ పథకాన్ని నీరు గారిచేందుకు పూనుకుంటున్నదని,బడ్జెట్లో క్రమంగా నిధులు తగ్గిస్తూ కనీస మద్దతు ధరల కంటే తక్కువకు అమ్మడం వల్ల ఏటా రైతులు నాలుగు లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి రాక అప్పులు తీరక ఆత్మహత్యలకు పాల్పడుతున్నరాని, ఏటా 10 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా కౌలు రైతుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వారి రక్షణకు కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని,ఫలితంగా దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలో సగానికి పైగా కౌలు రైతులవే ఉంటున్నవని అన్నారు.

ఏటా దేశంలో 9 కోట్ల ఎకరాల్లోని పంటలు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్నాయని,రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన చట్టాలు చేయటానికి నిరాకరిస్తున్నాయని,స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టువాడికి 50 శాతం కలిపి మద్దతు ధర గ్యారెంటీ చేసి చట్టం చేయాలన్నారు. పేద మధ్యతరగతి రైతులందరికీ  ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయాలని,60 ఏళ్లు పైబడిన అందరికీ పెన్షన్స్ ఇవ్వాలని,నాలుగు లేబర్ కోడ్లన్ రద్దు చేయాలని,విద్యుత్ సవరణ బిల్లు 2022 ఉపసహరించాలని,కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని,పెన్షన్స్ 10000 రూపాయలు అందరికీ చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని విస్తరించి పని రోజులను 200 పెంచి, రోజుకు 800 కనీస వేతనం ఇవ్వాలి. రైల్వే, రక్షణ, విద్యుత్ సహా ప్రభుత్వ రంగ సంస్థలను,పబ్లిక్ సర్వీస్ లను ప్రైవేటీకరణ చేయరాదన్నారు.అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి రాస్తరోకో నిర్వహించారు.ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్య యాదవ్ మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు గంధం భగత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వేణు,ఎం వెంకటయ్య, గొర్రెల మేపకదారుల సంఘం డైరెక్టర్ దేవేందర్,ప్రజా సంఘాల మండల కన్వీనర్ జీ వెంకటయ్య,రైతు సంఘం జిల్లా నాయకులు జంబులయ్య, సిఐటియు జిల్లా నాయకులు బాలకిషన్,అంగన్వాడి యూనియన్ నాయకులు శారద, అలివేల, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు శ్యామల, మహేశ్వరి, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు సుగ్రీవుడు, యాదగిరి,ఐకెపి వివో ఎల్ ఎ మండల అధ్యక్షులు రాజయ్య గౌడ్, పాన్గల్ మండల పరిధిలోని 28 గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంగన్వాడి, ఆశ కార్యకర్తలు, గ్రామపంచాయతీ, ఐకెపి వివో ఎల్ ఎ, రైతు సంఘం. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు