కాంగ్రెస్ పార్టీ వారు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు...మరి యాభై యేండ్లు అధికారంలో ఉండి ఏం చేశారు

కాంగ్రెస్ పార్టీ వారు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు...మరి యాభై యేండ్లు అధికారంలో ఉండి ఏం చేశారు
  • షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

ముద్ర, షాద్‌నగర్:-కాంగ్రెస్ కి ఓటేస్తే కష్టకాలమేనని,  అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు...మరి యాభై యేండ్లు అధికారంలో ఉండి ఏం చేశారని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు.కారు గుర్తుకు ఓటెయ్యండి, అభివృద్ధిని కొనసాగించండి అని ఆయన పేర్కొన్నారు.బుధవారం షాద్‌నగర్ నియోజకవర్గంలో ని లేమామిడి, నిర్ధవెళ్ళి గ్రామాల్లో షాద్‌నగర్ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్  ఎన్నికల ప్రచారం  నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య  యాదవ్  మట్లాడుతూ  గెలుపొందిన నాటి నుండి లేమామిడి, నిర్ధవెల్లి గ్రామాలు లో  చేసిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు.

రూ.2.94కోట్లతో సి.సి రోడ్డు నిర్మాణం పనులు, అంతర్గత మురుగు కాలువలు, ఆసరా పింఛన్ ధ్వారా  530 మందికీ ₹11,80,000/- రూపాయలు వస్తున్నాయని,రైతు బంధు లబ్ధిదారులు 2171 మంది, 26.37కోట్లు, రైతు రుణమాఫీ లబ్ధిదారులు 1232మంది, 7.37కోట్లు,రైతు భీమా లబ్ధిదారులు 24 మంది, 1.20కోట్లు  లబ్ది పొందారని అన్నారు.కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులు 241 మంది, 241.12 లక్షలు పొందారని తేలిపారు. లేమామిడి నుండి బొదునంపల్లి వరకు 1.58కోట్లతో బి.టి రోడ్, బి.టి రోడ్ బ్రిడ్జి 1.25 కోట్లు,నిర్ధవెళ్ళి నుండి తొమ్మిదిరేకుల 3.03కోట్లతో రోడ్, నిర్ధవెళ్ళి నుండి జూలపల్లి వరకూ 2.07కోట్లతో రోడ్, నిర్ధవెళ్ళి నుండి తలకొండపల్లి వయా శ్యామ్ రావ్ తండా వరకు 1.44కోట్లతో రోడ్ , 1.40 కోట్లతో నిర్దవెళ్ళి గ్రామంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు తేలిపారు  2.08కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా 7 ట్యాంకుల నిర్మాణంతో 1399 ఇండ్లకు త్రాగునీటి సరఫరా చేస్తునట్లు, మిషన్ కాకతీయ ద్వారా 16.55లక్షలతో బుర్గుకుంట చెరువు, 19.65లక్షలతో అన్నారెడ్డి చెరువు, 9.4లక్షలతో తుమ్మలకుంట చెరువు, 21.15 లక్షలతో దేశమోని కుంట చెరువు, 18.13 లక్షలతో పెద్ద కాల్వకుంట పూడికతీతా చెయ్యడం జరిగింది తేలిపారు.ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కారుగుర్తు పార్టీకి అండగా ఉంటూ కారుగుర్తుకు ఓటు వేసి మరొక్కసారి ఆశీర్వదించాలి, అభివృద్ధిని కొనసాగిద్దామని ఈ సందర్భంగా ప్రజలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్  కోరారు.