తీజ్ పర్వదిన వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ..
ముద్ర, శేరిలింగంపల్లి:మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తాండలో ఆదివారం గిరిజనులు ఏర్పాటు చేసిన తీజ్ పర్వదిన వేడుకల లో ఎమ్మెల్యే గాందీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ గిరిజనులు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ తీజ్ పండుగ అని ప్రతి ఒక్కరికి తీజ్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు .అదేవిధంగా భారత సాంస్కృతి సంప్రదాయాలను కాపాడిన మహనీయులు సేవాలాల్ మహరాజ్,దేశం పట్ల ధర్మం పట్ల ఆయన ఎన్నో సేవలుచేసారని,దేశంకోసం ,హిందు ధర్మంకోసం, ఆయన సేవలు కొనియాడుతూ గిరిజనుల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారు అని అన్నారు.సేవాలాల్ మహరాజ్ మానవ మాతృడు కాదని దైవంశ సంబూతులని అన్నారు.గిరిజనుల అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన నిత్య కృషి వలుడు అని, గిరిజనులు మంచి చదువులు చదువుకొని అన్ని రంగాలలో అభివృద్ధి చెందలని ఆశించిన మహానుభావుడు అని, దేశ ప్రజలు ముఖ్యంగా యువత ఆయనను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గంలో నడవాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్ ముదిరాజు, గంగాధర్ మరియు నడిగడ్డ తండా వాసులు స్వామి నాయక్, లకపతి నాయక్, తిరుపతి నాయక్, శంకర్ నాయక్, రత్నాకర్, అబ్రహం, సుధాకర్, జీత్తు నాయక్, మధు నాయక్, సీతారాం నాయక్,హనుమంతు నాయక్,గోపి నాయక్, తుకారాం నాయక్ దశరత్ నాయక్, హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు