నిధుల లేమి పేరిట జాప్యం చేయొద్దు - ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిధుల లేమి పేరిట జాప్యం చేయొద్దు - ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు హామీల ఫలితాలు లబ్ధిదారులకు చేరాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల సాకుతో ఇచ్చిన హామీలను పక్కన పెడితే సహించబోమని ఆయన అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ లో ప్రజాపాలన, అభయహస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభయహస్తం పథకాలకు అర్హులైన  ప్రజలందరూ  చేసుకోవాలని సూచించారు. నిర్మల్ నియోజక వర్గంలో   పేద ప్రజలందరికీ ప్రతీ సంక్షేమ పథకం అందేలా రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని, ప్రజలందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.   ఈ కార్యక్రమంలో నాయకులు నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, రావుల రాంనాథ్, జడ్పీటీసీ పత్తి రాజేశ్వర్ రెడ్డి,  సర్పంచ్ మురళి కృష్ణ, ఉపసర్పంచ్ విలాస్,వార్డ్ మెంబర్ తిరుమల చారి, రాం శంకర్ రెడ్డి, గంగారెడ్డి, చెన్న రాజేశ్వర్, వడ్డే రాజేందర్ రెడ్డి, అయిండ్ల భూపాల్ రెడ్డి, దిలావర్ పూర్ జెడ్పీటీసీ తక్కల రమణ రెడ్డి,ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.