సమాజంలో రజకుల నాయి బ్రాహ్మణుల పాత్ర కీలకం

సమాజంలో రజకుల నాయి బ్రాహ్మణుల పాత్ర కీలకం

జగిత్యాల ఎమ్మెల్యే డా . సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సమాజంలో రజకుల నాయి బ్రాహ్మణుల పాత్ర చాలా కీలకమని వారి సేవలను అందరూ గుర్తించాలని జగిత్యాల ఎమ్మెల్యే డా . సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలో ఎల్ జి గార్డెన్స్ లో జగిత్యాల నియోజకవర్గ రజక, నాయి బ్రాహ్మణ కుల సంఘాల సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ తోకలిసి పాల్గొని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ బట్టల, తల మురికే కాదు సమాజ మురికిని తీసేసత్తా రజకులకు,నాయి బ్రాహ్మణులకు ఉందన్నారు.

ముఖ్యమంత్రి రజకులు, నాయి బ్రాహ్మణుల సేవలను గుర్తించి వారికి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగిందని కులవృత్తిలను ప్రోత్సహించడంలో కెసిఆర్ గారి పాత్ర కీలకమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు చేసి వారు ఆత్మగౌరారంతో ఉండే విధంగా చేసిన ఘనత కేసిఆర్ ది అన్నారు. నేడు కులవృత్తిలో అంతరించకుండా ప్రోత్సాహానికి లక్ష రూపాయలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, రజక, నాయి బ్రాహ్మణ కుల సంఘాల నాయకులు మానల కిషన్, మర్రిపెళ్ళీ నారాయణ, రాచార్ల విజయ్, శ్రీనివాస్, పోచయ్య,శేకర్ పాల్గొన్నారు.