సింగితల గురవరెడ్డి మృతికి ఎమ్మెల్యే, ఎంపీ నివాళులు 

సింగితల గురవరెడ్డి మృతికి ఎమ్మెల్యే, ఎంపీ నివాళులు 

ముద్ర ,మఠంపల్లి : తాను పనిచేసిన పార్టీల సిద్ధాంతాల కోసం నిరంతర శ్రామికుడిగా పనిచేసిన నిఖార్సయిన కార్యకర్త సింగితల గురవరెడ్డి అని హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి అన్నారు.సోమవారం మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెం గ్రామానికి చెందిన బి ఆర్ యస్ కార్యకర్త గురవరెడ్డి మృతదేహానికి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ మాజీ పి సి సి అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ యన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురవరెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో ఆయా పార్టీ నాయకులు యం పి పి పార్వతి కొండా నాయక్,జడ్పిటిసి జగన్ నాయక్, ఇరుగు పిచ్చయ్య,మన్నెం శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరికుంట్ల వెంకట నారాయణ, మంజూ నాయక్,గంగసాని యల్లారెడ్డి, మాజీ జడ్పిటిసి అరుణ సైదులు, రామిశెట్టి అప్పారావు, దేవపంగు అచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.