ఏసు క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి సోపానాలు - ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

ఏసు క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి సోపానాలు - ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:లోక రక్షకుడు ఏసు క్రీస్తు బోధనలు అనుసరించటం శాంతి మార్గానికి బాటలు వేస్తుందని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ఆయన నిర్మల్ లోని గాజుల పేట సి ఎస్ ఐ చర్చి, సోన్ మండలం మాదాపూర్ బేతేలు చర్చిలలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.

క్రీస్తు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసు క్రీస్తు తన ప్రాణాలను సైతం త్యాగం చేసి ప్రజల్లో శాంతి సామరస్యాలను పెంపొందించడంలో కృషి చేశారన్నారు. ఆయన చూపిన బాట, ఇచ్చిన శాంతి సందేశం నేటి ఉద్రిక్తతలను అణిచివేయడంలో ఎంతగానో తోడ్పడుతుందని కొనియాడారు.