వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి

వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి

ఇబ్రహీంపట్నం, ముద్ర ప్రతినిధి: తుర్క యాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో కోహెడ గ్రామం లో శ్రీశ్రీశ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, స్థానిక కౌన్సిలర్లతో కలిసి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ పరిధిలోని మైత్రి కుటీర్ కాలనీలో మైత్రి మైసమ్మ కళ్యానోత్సవం, మజీద్ పూర్ గ్రామంలో మహమ్మాయి దేవి రథోత్సవం, లక్ష్మి నర్సింహా స్వామి కళ్యానోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.