ఎడ్ల పంద్యాలను  ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి

ఎడ్ల పంద్యాలను  ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి

చిలుకూరు,  ముద్ర : మండలంలోని బేతవోలు  గ్రామంలో శుక్రవారం కనకదుర్గమ్మ జాతర సందర్భంగా ఎడ్ల పంద్యాలను కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు పండుగ సంప్రదాయాలను అందరూ గౌరవించాలని కనకదుర్గమ్మ జాతర సందర్భంగా ప్రతి యాట ఎడ్ల పంద్యాలు కోలాటాలు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని  బేతవోలు  గ్రామ ప్రజలు మంచి వాతావరణం లో పండుగను జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా వివిధ పార్టీల ఆధ్వర్యంలో కోలాటాల ప్రదర్శనలు ట్రాక్టర్లకు ప్రభలు కట్టి గుడి దగ్గరకు ర్యాలీ నిర్వహించారు, మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో వట్టికూటి నాగయ్య, బజ్జూరి రవీందర్ రెడ్డి, వట్టికూటి ధన మూర్తి, బజ్జూరి వెంకట్ రెడ్డి , ముసుగుల వీరారెడ్డి, నెమ్మాది సైదా బాబు, వంగూరు రమేష్, సిపిఐ, సిపిఎం, బి ఆర్ ఎస్, కాంగ్రెస్, పార్టీల ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శనలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగన్నా చంద్రశేఖర్,జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, జూలకంటి రంగారెడ్డి, పచ్చిపాల వేణు, తాళ్లూరి  శ్రీనివాస్, చారి, కుర్ర అచ్చయ్య, జానీ మియా, తదితరులు పాల్గొన్నారు.