పారిశుద్ధ్యం *తాగునీటి, ఇంటింటి చిత్త సేకరణ సమస్య పై ప్రత్యేక దృష్టి పెట్టండి -   ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

పారిశుద్ధ్యం *తాగునీటి, ఇంటింటి చిత్త సేకరణ సమస్య పై ప్రత్యేక దృష్టి పెట్టండి -   ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :  మునిసిపాలిటీలో ప్రజలు అధికంగా విద్యుత్ మురికి కాలువల మరియు చెత్త బండ్ల నిర్వహణపై ఫిర్యాదులు చేస్తున్నారని కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కౌన్సిలర్ల సహకారంతో ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సూచించారు సోమవారం మునిసిపల్ చైర్మన్ కల్పనా భాస్కర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం విస్తరిస్తున్న సందర్భంలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి తన వద్దకు తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు తాను అన్నివేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.

పారిశుద్ధ్యం తాగునీటి సమస్య పై ప్రత్యేక దృష్టి సారించకపోతే ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుందని వెంటనే వాటిని పరిష్కరించేందుకు రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తూ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జిల్లా మెడికల్ కళాశాల స్థాయిని పెంచేందుకు 300 నుంచి 600కు అనుమతులు నివ్వడం జరిగిందని త్వరలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పూర్తి ప్రతిపాదనలను సిద్ధం చేసి అనుమతులు తీసుకుంటామని త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. శానిటేషన్ సమస్య పట్టణంలో అధికంగా ఉందని జిల్లా ఆసుపత్రిలో కూడా నెలకొని ఉందని వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందని ముఖ్యంగా మున్సిపల్ అధికారులు ఫిర్యాదులకు స్పందించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.