కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఫార్మర్సించిన ఎమ్మెల్యే సామెల్

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఫార్మర్సించిన ఎమ్మెల్యే సామెల్

మోత్కూరు ముద్ర:గురువారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి లో జరిగిన కాంగ్రెస్, టిఆర్ఎస్ ల మధ్య జరిగిన ఘటనలో గాయపడిన పాటిమట్ల గ్రామ, మోత్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు గౌడ్ ను శుక్రవారం ఎమ్మెల్యే మందుల సామేల్ పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేయలేని టీఆర్ఎస్ నాయకులు అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి చేయడం పిరికిపందల చర్య అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను ఆదుకుంటామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు గుర్రం లక్ష్మి నర్సింహారెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు చిరుమర్తి యాదయ్య, పట్టణ అధ్యక్షులు గుండాగోని రామచంద్రు గౌడ్, సీనియర్ నాయకులు బండ విజయ్ రెడ్డి, గుండా రాములు, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు