ఇంటింటి ఎన్నికల ప్రచారానికి శంఖారావం మోగించిన కాంగ్రెస్ శ్రేణులు

ఇంటింటి ఎన్నికల ప్రచారానికి శంఖారావం మోగించిన కాంగ్రెస్ శ్రేణులు
  • ముఖ్యఅతిథిగా హాజరైన పార్లమెంటు ఇంచార్జ్ సంపత్ కుమార్
  • కరపత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ముద్ర/ షాద్ నగర్:- పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారానికి కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల శంఖారావం మోగించారు. సోమవారం పట్టణ సమీపంలోని చౌడమ్మ గుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ సంపత్ కుమార్, ఎమ్మెల్యే వీ ర్లపల్లి శంకర్ లు మాట్లాడుతూ పాలమ ూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్ల వంశీ చంద్ రెడ్డికి మద్దతుగా షాద్ నగర్ నియోజకవర్గం లో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. బూతు స్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రతి కార్యకర్త క్రమశిక్షణకు పనిచేసి వంశీచంద్ రెడ్డి జయం కోసం కృషి చేయాలని కోరారు.

పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చందర్ రెడ్డి గారికి మద్దతుగా  చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి పూజా కార్యక్రమం నిర్వహించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా 500 వాహనాలలో ఒకే రోజు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రచారం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల పనిచేసి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలిపించారు. ప్రతిపక్ష బి ఆర్ ఎస్, బిజెపి పార్టీలు చెప్పే మాయమాటలు ఎవరు నమ్మవద్దని సూచించారు. శాసనసభ ఎన్నికల్లో ఎలా పనిచేశారో అదే తరహాలో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. పనిచేసే కార్యకర్త లకు పార్టీ గ్రేడ్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు వివరించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, వంశీ చందర్ రెడ్డి  సతీమణి అశ్లేష రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, ఆరు మండలాల అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.