గ్రామసభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయాలి

గ్రామసభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయాలి
  • అర్హులకే ప్రభుత్వ అన్ని ఫలాలు అందాలి 
  • షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ముద్ర, షాద్‌నగర్:- నిజమైన అర్హులు ఎవరైనా...ఏ పార్టీ వారైనా... సరే ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందె విధంగా..  గ్రామసభల ద్వారా లబ్ధిదార్లను  ఎంపిక చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ప్రజలను గిరిగిసి పాలించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలించదని ఆయనా తేలిపారు. బుధవారం కేశంపేట మండలం వేముల నర్వ గ్రామంలో యాచవరం శ్రీకాంత్ రెడ్డి జ్ఞాపకార్థంగా ఆయన తండ్రి మోహన్ రెడ్డి నిర్మించిన నూతన బస్ షెల్టర్ ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని యాచవరం మోహన్ రెడ్డి తన కుమారుడు యాచవరం శ్రీకాంత్ రెడ్డి జ్ఞాపకార్ధంగా బస్సు షెల్టర్ నిర్మించడంపై అభినందించారు. ఇలాంటి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. అనంతరం వేముల గ్రామంలో పర్యటించారు. తన గెలుపుకు సహకరించిన పేద ప్రజలను స్వయంగా కలుసుకొని మాట్లాడారు. గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉండడానికి కనీసం ఇల్లు లేని వారిని కలుసుకొని వారికి తప్పకుండా ప్రభుత్వం ద్వారా ఇండ్లు వచ్చేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే శంకర్ అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. తనకు శత్రువులు అంటూ ఎవరూ లేరని ప్రజలు అందరూ తనకు కావలసిన వారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను నాయకులను అన్ని వర్గాలను విభజించి పాలించారని,  నిజమైన అర్హులకు కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాత్రం ఎవరికి వ్యతిరేకం కాదని తాను ఒక ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. గ్రామాల్లో సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో గ్రామసభ ద్వారా గ్రామ పెద్దలను ఏకం చేసి వారి నిర్ణయం మేరకే అర్హులైన పేదలకు సంక్షేమం అందే విధంగా కృషి చేయాలని సూచించారు. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావని పేర్కొన్నారు. ఇతర పార్టీలలో కూడా ఎంతోమంది పేదలు ఉన్నారని వారు అర్హులైతే వారికి కూడా సంక్షేమ ఫలాలు అందుతాయని తేలిపారు.

.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్ కేశంపేట్ జెడ్పిటిసి  విశాల శ్రావణ్ రెడ్డి గ్రామ సర్పంచ్ మంజుల మల్లేష్ ఇప్పలపల్లి ఎంపిటిసి మంజుల రాజశేఖర్ కొండారెడ్డిపల్లి నాయకులు పల్లె ఆనంద్ సర్పంచ్ అంజయ్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య  సురేష్ రెడ్డి కేశంపేట మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి గ్రామ సమన్వయ కార్యకర్తలు వార్డ్ సభ్యులు గ్రామస్తులు మల్లేష్, నవీన్,నరేందర్, శకర్,గణేష్, రాఘవేందర్, మాల్లై యాదయ్య, నర్సింలు ఎస్టీ సెల్ రుప్ల నాయక్, మహిళ సంఘం నాయకులు అనసూయ కార్యక్రమంలో పాల్గొన్నారు.