అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట హిందువులకు అద్భుత ఘట్టం

అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట హిందువులకు అద్భుత ఘట్టం
  • బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు మద్దతుగా మండల వ్యాప్తంగా శోభాయాత్ర
  • రామాలయంలో ఎమ్మెల్యే మందుల ప్రత్యేక పూజలు

తుంగతుర్తి,ముద్ర:-అయోధ్య రామ మందిరంలో హిందువులంతా గర్వంగా చెప్పుకునేలా శ్రీరామచంద్రుడి ప్రాణప్రతిష్ట జరగడం హిందువులకు ఒక అద్భుత ఘట్టమని తుంగతుర్తి శాసనసభ్యులు మండల సామెల్ అన్నారు. సోమవారం అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రం తో పాటు గ్రామాల్లో ప్రాణ ప్రతిష్టకు మద్దతుగా శోభాయాత్ర నిర్వహించి దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం తో పాటు ఆధ్యాత్మికత వెల్లువిరిచింది.

ప్రతి ఒక్కరూ శోభాయాత్ర పాల్గొని రాముడికి ప్రత్యేక పూజలు చేసి తమ గ్రామాల్లో సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. అంతకుముందు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతా రామ చంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగ ఆలయ అర్చకులు సామెల్ కు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ రామచంద్రస్వామిని పార్థించినట్లు తెలిపారు. ఈ పుణ్య కార్యంలో హిందువులే కాకుండా అన్ని మతాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. రామ మందిర నిర్మాణాన్ని భారతీయ సంస్కృతి సాధించిన విజయం గా అభివర్ణించిన ఆయన సర్వ మతాల ప్రజలు ప్రత్యేక పూజలు చేయడం సంతోషకరమన్నారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ సంకినేని స్వరూప రవీందర్ రావు,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, మండల కమిటీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్,జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, జిల్లా నాయకులు ఓరుగంటి సత్యనారాయణ, పెండెం రామ్మూర్తి, యువజన నాయకులు పెద్ద బోయిన అజయ్ కుమార్, ముత్యాల వెంకన్న, అంబటి రాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.