సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

సారంగాపూర్ ముద్ర: సారంగాపూర్ మండలంలోని పెంబర్ల గ్రామంలో పది లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. గ్రామంలోని తోట వెంకటేష్ ఇంటి నుండి దళిత కాలనీలోకి 10 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు.

రాగా అదే కాలనీలో కొందరు వ్యక్తులు నూతనంగా ఇంటి నిర్మాణాన్ని రోడ్డుపైనే నిర్మిస్తున్నారని అదే కాలనీకి చెందిన తోట వెంకటేష్ తో పాటు పలువురు వ్యక్తులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముందే అభ్యంతర వ్యక్తం చేశారు. కానీ సదర్ వ్యక్తి తన ఇంటి స్థలంలోనే ఇంటి నిర్మించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోలజమున జడ్పిటిసి మనోహర్ రెడ్డి సర్పంచ్ రాజన్న తదితరులు పాల్గొన్నారు