మోడీ దిగజారి మాట్లాడారు ..

మోడీ దిగజారి మాట్లాడారు ..

గిరిజన విశ్వవిద్యాలయం స్థాపించాడానికి పదేళ్లా.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

ముద్ర ప్రతినిధి, జనగామ : నిజామాబాద్‌ సభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు నిధులు కేటాయిస్తారని ఆశపడ్డామని, దానికి భిన్నం తెలంగాణ సమాజాన్ని అగౌరపరిచేలా.. కేసీఆర్‌‌ను అవమాన పరిచేలా.. నీచ స్థాయికి దిగజారి మాట్లాడడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన జనగామ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పీఎం, సీఎంల మధ్య జరిగిన అంతరంగిక విషయాలను పబ్లిక్‌గా మాట్లాడడం మోడీ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. కేటీఆర్‌ సీఎంపై సీఎల్పీ ఎన్నుకొంటే సీఎం అవుతారన్నారు. ప్రధానియే సీఎంను చేసే వ్యవస్థ మన దేశంలో లేదన్నారు. దీంతో మోడీ జ్ఞానం పరిధి ఏమిటో అందరికీ అర్థమైందన్నారు. మోడీకి సిగ్గు శరం ఉంటే విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణకు తొమ్మిదేళ్లలో తమరు చేసిన మేలు ఏమిటో చెప్పాలన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం స్థాపించాడానికి పదేళ్లు పడుతుందా అని ప్రశ్నించారు. పోలవరంకి జాతీయ హోదా ఇచ్చి, కాలేశ్వరానికి ఎందుకు ఇవ్వలేదని అన్నారు. తెలంగాణలో బీబేపీ అవసరమా, బీజేపీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీ నాయకులు దద్దమ్మలని, చీము నెత్తురు ఉంటే ప్రశ్నించాలని మండిపడ్డారు. తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సీఎం కేసీఆర్‌కి అండగా ఉండి గెలిపించి తెలంగాణ అభివృద్ధిలో తోడ్పాటునందిస్తామన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, లింగాలఘణపురం జడ్పీటీసీ గుడి వంశీధర్‌‌రెడ్డి, కొమురవెళ్లి దేవస్థానం మాజీ చైర్మన్‌ సేవెళ్లి సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.