కారుగుర్తు పై ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ గెలిపిచండి..

కారుగుర్తు పై ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ గెలిపిచండి..
  • రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు...
  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ..

గొల్లపల్లి. ముద్ర:-జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం కేంద్రంలో రోడ్డు షోలో ఈ నెల ముప్పైన జరిగే శాసనసభ ఎన్నికల లో కారు గుర్తు పై ఓటు వేసి ధర్మపురి టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓటర్లు ను అభ్యర్థించారు.

ఆదివారం మండల కేంద్రంలో రోడ్డు షోలో సమావేశం ఏర్పాటు సందర్భంగా ఆమె మాట్లాడుతూ...

బీఆర్ఎస్ పార్టీ తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, ఆమె చెప్పారు. కారు గుర్తుతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని, కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రమంతా కటిక చీకట్లు అలుముకుంటాయని అన్నారు.  బీజేపీ గెలిస్తే ఎవరికీ లాభం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి యాబైఐదు ఏళ్ల పాటు అవకాశం ఇస్తే ఏమీ చేయలేదని, ఇప్పుడు మరొసారి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ అడగడం విడ్డూరంగా ఉందని అన్నారు.  బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు.  సౌభాగ్య లక్ష్మీ పథకం కింద పేద మహిళలకు నెలకు రూ. మూడువేలకె పెన్షన్ ఇవ్వాలని, రాష్ట్రంలో తొబై మూడు లక్షల కుటుంబాలకు కేసీఆర్ రక్ష బీమా సౌకర్యం కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని వివరించారు. కాబట్టి కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో. ఎంపీ వెంకటేష్ నేత జెడ్పి చైర్మన్ దావ వసంత సురేష్ జడ్పిటిసి గోస్కుల జలంధర్ ఎంపీపీ నక్క శంకరయ్య వైస్ ఎంపీపీ ఆవుల సత్యం సింగల్ విండో చైర్మన్ రాజ్ సుమన్ రావు. చందోలి సింగిల్ విండో  చైర్మన్ వేణు మాధవరావు   మార్కెట్ చైర్మన్  కాంపెల్లి హనుమాన్లు మండల అధ్యక్షుడు బొల్లం రమేష్ పట్టణ అధ్యక్షుడు పడాల జలంధర్ ముస్కు లింగారెడ్డి  బోనగిరి మల్లారెడ్డి  బోనగిరి వెంకటేష్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.