తొలి జీతాన్ని సీఎం బాబుకు అందించిన ఎంపీ కలిశెట్టి

తొలి జీతాన్ని సీఎం బాబుకు అందించిన ఎంపీ కలిశెట్టి

 న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిని కాంక్షిస్తూ భారత పార్లమెంటు ద్వారా తొలిసారిగా అందిన గౌరవ వేతనం రూ. 1.57 లక్షల చెక్కును ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అందించారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నారా చంద్రబాబు నాయుడును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం స్వయంగా కలిసి, రూ 1.57 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం, అదే సన్నిధానంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈనెల 4న అందిన తన తొలి నెల గౌరవ వేతనం రూ. 1.57 లక్షల చెక్ ను చంద్రబాబు నాయుడుకు అందజేశానని పేర్కొన్నారు.