కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు

కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు

ముద్ర,పానుగల్:- విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎంపీడీవో కోటేశ్వరరావు ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ అన్నారు. బుధవారం పానుగల్ మండల పరిధిలోని కేతేపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.పదవ తరగతి తర్వాత లక్ష్యాన్ని ఎంచుకొని ఇష్టంతో చదివితే సఫలీకృతులు అవుతారన్నారు. కేతేపల్లి పాఠశాల అంటే ఒక ప్రత్యేకత ఉందని ఆ ప్రత్యేకతను కాపాడుకోవాలని సూచించారు.ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు తప్పనిసరిగా 10 పాయింట్లు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రామానికి చెందిన వంగూరు బాలీశ్వర్ రెడ్డి కుమారుడు అనీశ్ రెడ్డి అమెరికాలో ఉన్నత ఉద్యోగం చేస్తూ తాను చదివిన పాఠశాలకు గ్రామానికి ఏదో ఒకటి చేయాలని సదుద్దేశంతో దాదాపుగా ఏడువేల రూపాయలతో విద్యార్థులకు పరీక్ష వ్రాయడానికి అవసరమయ్యే మెటీరియల్ ను అందజేశారు.పదవ తరగతి విద్యార్థులు కూడా ఐదు సంవత్సరాలు   కేతేపల్లి పాఠశాలకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులను తలుచుకుంటూ  పాఠశాలను,ఉపాధ్యాయులను ఎప్పటికీ మర్చిపోమని మేము కష్టపడి చదివి మంచి మార్కులతో పాసై పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుక వస్తామని తెలిపారు.కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల నుండి ఇటీవల బదిలీపై వెళ్లిన ప్రధానోపాధ్యాయులు శంకరయ్యను హెచ్ఎం రవికుమార్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రవికుమార్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.