సూర్యాపేట బిఆర్‌ఎస్‌లోకి వలసల జాతర

సూర్యాపేట బిఆర్‌ఎస్‌లోకి వలసల జాతర
  • బిఎస్పి అభ్యర్థి జానయ్య కోడి కత్తి డ్రామాలకు నిరసనగా బిఎస్పి ను వీడి ముకుమ్మడిగా బిఆర్ఎస్ లో చేరిన గాంధీనగర్ ఎస్సీ కాలనీ అంబేద్కర్ యూత్
  • కాంగ్రెస్‌ నుంచి 180 మంది నేతలు ,కార్యకర్తల చేరిక
  • కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి జగదీష్ రెడ్డి
  • కాంగ్రెస్ వీడిన అనంతుల  శ్రీనివాస్ గౌడ్, 31 వ వార్డు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపర్తి నాగరాజు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో  సూర్యాపేట నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలోకి వలసల జాతర కొనసాగుతుంది. పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధికి మద్దతు తెలుపుతూ, స్వలాభం కోసం చేస్తున్న నీచ రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ , బీఎస్పీ లను వీడి ఆ పార్టీల నాయకులు ,కార్యకర్తలు బిఆర్ఎస్ లో చేరుతున్నారు. ఈరోజు గాంధీనగర్ ఎస్సీ కాలనీ చెందిన శ్రీకాంత్, రుత్విక్ యాకోబు, విజయ్ మధు అనిల్ తో పాటు 106మంది అంబేద్కర్ యూత్ సభ్యులు మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు అనంతల శ్రీనివాస్ గౌడ్ ఆ పార్టీని వీడి బఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 31 వ వార్డు నుండి కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు రాపర్తి నాగరాజు తో పాటు 83  మంది యూత్ కాంగ్రెస్ నాయకులు భిఆర్ఎస్ లో చేరగా గులాబీ కండువా కప్పి మంత్రి జగదీష్ రెడ్డి సాదరంగా ఆహ్వానం పలికారు. కౌన్సిలర్ దిలీప్ రెడ్డి,రఫీ ,జనార్దన్, అనంతల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధికి ఆకర్శితులై, తనకు మద్దతుగా పార్టీలో వారికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేటను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే  తన లక్ష్యమని, జరుగుతున్న అభివృద్ధి యజ్ఞంలో పార్టీలకతీతంగా ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.