Flood Relief Fund - తెలుగు రాష్ట్రాల‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించిన మహేష్ బాబు

Flood Relief Fund - తెలుగు రాష్ట్రాల‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించిన మహేష్ బాబు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇరు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోయారు. ఈ క్రమంలో సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు వరద బాధితుల సహాయార్థం విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు రూ.కోటి భారీ సాయాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు రూ.50 లక్షల చొప్పున మహేష్ బాబు సాయం చేస్తానన్నారు.