కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి మంత్రి శ్రీనివాస్ గౌడ్

కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి మంత్రి శ్రీనివాస్ గౌడ్

ముద్ర ప్రతినిధి, మహబూబ్ నగర్: వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల నిమిత్తం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కే .తారక రామారావు ఈనెల 6 న జిల్లాకు వస్తున్నందున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం అయిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పర్యటించనున్న ప్రాంతాలను, వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు ,శంకుస్థాపన ప్రదేశాలను సందర్శించి పనులను పర్యవేక్షించారు. ముందుగా దివిటిపల్లి వద్ద ఉన్న ఐటీ టవర్ ను సందర్శించి అక్కడ నిర్మాణంలో ఉన్న రహదారిని, ఐటీ టవర్ ప్రారంభానికి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం శిల్పారామం, వివిధ జంక్షన్ల అభివృద్ధి, తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఐటీ టవర్ వద్ద మీడియా తో మంత్రి మాట్లాడుతూ గతంలో పాలమూరు కూలీలు అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి అని ,జిల్లా నుండి కరువును పారద్రోలి పేదరికాన్ని పారద్రోలేందుకు ఎన్నో ఏళ్లుగా కన్న కలలు ఇప్పుడు సహకారం అవుతున్నాయని, ఇందులో భాగంగానే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి 400 ఎకరాలలో చేపట్టిన ఐటీ కారిడార్ లోని ఐటి టవర్ ను ప్రారంభించేందుకు వస్తున్నారని తెలిపారు. దిటిపల్లి ఐటీ కారిడార్ లో మన దేశం నుండే కాక ఇతర దేశాలకు చెందిన వారు  సైతం ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఐటి టవర్ ప్రారంభం సందర్భంగా 8 ఐటి కంపెనీలతో శనివారమే ఒప్పందం చేసుకో నున్నట్లు ఆయన వెల్లడించారు. ఐటీ టవర్ లో గీగా కంపెనీలతోపాటు ,అతిపెద్ద ఎనర్జీ పార్కు ఇక్కడికి రావడం జిల్లా వాసుల అదృష్టమని అన్నారు.

రానున్న రెండు మూడు ఏళ్లలో 50వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా లక్ష్యంగా నిర్ణయించుకున్నామని, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాధిస్తామని, పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని సౌకర్యాలు కల్పించి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అని అన్నారు .ఐటీ టవర్ లో పూర్తిస్థాయిలో అన్ని పరిశ్రమలు ఏర్పాటుచేసిన  తర్వాత భూత్పూర్ అన్న సాగర్ మధ్య కూడా పరిశ్రమలు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక్కడ వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఐటి టవర్ నుండి బైపాస్ వరకు కొత్త రహదారి నిర్మించడం జరుగుతున్నదని. నిరుద్యోగులకు గొప్ప అవకాశాలు  ఐటి కారిడార్ లో  కల్పించడంజరుగుతుందని  మంత్రి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాను నూటికి నూరు శాతం అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు. జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ,ఎస్పీ కే. నరసింహ,అదనపు కలెక్టర్ కె. సీతారామరావు, టీఎస్ఐఐసి జోనల్ మేనేజర్ రవి, ఆర్డిఓ అనిల్ కుమార్, ఇతర అధికారులు, పోలీసు అధికారులు ,తదితరులు ఉన్నారు.