ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
  • మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోదల బీరయ్య

ముద్ర.వీపనగండ్ల:-రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 28 నుంచి చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని మండలంలోని ప్రతి గ్రామంలో విజయవంతం చేయటానికి ప్రతి ఒక్కరు సహకరించాలని  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోదల బీరయ్య మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు ఏత్తం కృష్ణయ్య, నారాయణరెడ్డి లు కోరారు. ప్రజాపాలన కార్యక్రమం పై మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించి అర్హులైన వారితో దరఖాస్తు చేయించాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించటం జరుగుతుందని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు 2500 ఆర్థిక సహాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు ఏటా 12 వేల రూపాయలు,తెలంగాణ అమరవీరులకు మరియు ఉద్యమకారులకు 250 చ" గజాల ఇంటి స్థలం, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్,చేయత పథకం ద్వారా 4 వేల రూపాయలు,దివ్యాంగులకు 6 వేల రూపాయలు పింఛన్ అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పానగల్ సింగల్ విండో మాజీ అధ్యక్షులు బాల్ రెడ్డి, సర్పంచ్ నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ సుదర్శన్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, నాయకులు వెంకటస్వామి, చక్ర వెంకటేష్, వెంకట్ రెడ్డి,వేంకటేశ్వర్ రెడ్డి,బుచ్చన్న,గోపాల్ నాయక్,పెద్దరాంబాబు తదితరులు ఉన్నారు.