కాంగ్రెస్ కు ఓటు వేస్తే అధోగతే

కాంగ్రెస్ కు ఓటు వేస్తే అధోగతే
  • మండల రైతు బంధు సమితి మాజి అధ్యక్షుడు ముంత మల్లయ్య యాదవ్

ముద్ర.వీపనగండ్ల:- నాలుగు నెలల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నలబై ఏళ్లు నరకం చూపెడుతోందని వీపనగండ్ల మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు ముంత మల్లయ్య యాదవ్ అన్నారు.వీపనగండ్ల లో గురువారం ఉపాధి హామీ పథకం పనుల కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కార్యకర్తలతో కలిసి  వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే కరెంటు. నీటి కష్టాలు మొదలయ్యాయని. అలాగే 2023లో శాసనసభ ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మోసం చేసింది అన్నారు.

రైతులకు ఏనాడు పంటలు ఎండకుండా సాగునీరు అందించిన ఘనత  బీఆర్ఎస్ సర్కార్ దే అని అన్నారు. రైతుబంధు అందక, రుణమాఫీ కాక రైతులు బ్యాంకుల చుట్టూ మళ్ళీ తిరుగుతున్నారు. కాంగ్రెస్ పాలల్లో రైతులకు కన్నీళ్లు మిగిలాయని ఎద్దేవా చేశారు. నాలుగు నెలల్లో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు అర్థమైందని. పార్లమెంట్ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తుపై ఓట్లేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అత్యధిక మెజారిటీ గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ముంత శివ యాదవ్, రాముడు,క్రాంతి తదితరులు ఉన్నారు.