మండల స్థాయి సీఎం కప్ 2023 ను విజయవంతం చేయాలి

మండల స్థాయి సీఎం కప్ 2023 ను విజయవంతం చేయాలి

ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి.

హుజూర్ నగర్, ముద్ర: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చీఫ్ మినిస్టర్ కప్ 2023 ను మండల స్థాయిలో విజయవంతం చేయాలని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జెడ్పిటిసి కొప్పల సైదిరెడ్డిలు తెలిపారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయం లో హుజూర్ నగర్ నందు చీఫ్ మినిస్టర్ కప్ 2023నకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయుల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల స్థాయి చీఫ్ మినిస్టర్ కప్ 2023 స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్యాంపు, హుజూర్ నగర్ నందు ఈనెల 15వ తారీకు నుండి 17వ తారీకు వరకు ఉదయం 9 గంటల నుండి నిర్వహించబడునని, ఈ కప్ పోటీలకు 15 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల వరకు గల యూత్ అర్హులన్నారు.

 ఈ పోటీలు అథ్లెటిక్స్ ,ఫుట్ బాల్, కబడ్డీ,ఖో ఖో, వాలీబాల్ పురుషులకు మరియు మహిళలకు నిర్వహించబడతాయని, ఈ పోటీలలో హుజూర్నగర్ మండలంలోని అన్ని గ్రామాల యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, అంతేకాకుండా జిల్లా స్థాయిలో మరియు రాష్ట్రస్థాయిలో రాణించి మండలానికి పేరు తీసుకురావాలని తెలియజేశారు. గ్రామస్థాయిలోని వివిధ ప్రజా ప్రతినిధులు యువత అధికంగా పాల్గొనేటట్లు సహకరించాలని కోరారు. ఈ ఆటల పోటీలలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శాంతకుమారి, డిప్యూటీ తాసిల్దార్ సుధారాణి, సూపరిండెంట్ నర్సిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ చంద్రకళ, పిఈటీ లు  సునీల్, బ్రహ్మారెడ్డి, శ్రీధర్, రవీందర్ రెడ్డి, విజయ్, సిఆర్పి సైదులు తదితరులు పాల్గొన్నారు.