కాంగ్రెస్ లో పలువురు చేరిక

కాంగ్రెస్ లో పలువురు చేరిక
  • పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం సారంగాపూర్ పాక్స్ చైర్మన్ నర్సింహ రెడ్డి, లక్ష్మీదేవి పల్లి ఎం పి టీ సీ మమత తో పాటు మరో 50 మంది, లచ్చక్క పేట గ్రామానికి చెందిన గౌడ సంఘం అధ్యక్ష,ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్థి జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరిన సారంగాపూర్ పాక్స్ చైర్మన్ నర్సింహ రెడ్డి, లక్ష్మీదేవి పల్లి ఎం పి టీ సీ మమత తో గౌడ సంఘం కార్యవర్గానికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ లో చేరిన వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని అన్నారు.సారంగాపూర్ ను ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు కొండ్ర మల్ల రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు.సారంగాపూర్, బీర్పోర్ మండలాలకు సాగు నీరు, తాగునీరు సమకుర్చుతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.