బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టుల వార్నింగ్ లెటర్

బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టుల వార్నింగ్ లెటర్

బీఆర్ఎస్ పార్టీ నేతలకు మావోయిస్టు పార్టీ వార్నింగ్ లెటర్ విడుదల చేసింది. దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలారా ఖబద్దార్ అంటూ హెచ్చరించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపణలు చేసింది. దళిత బంధు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూలు చేశారని మండిపడింది. అమాయకుల నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రజలకు డబ్బు తిరిగి ఇవ్వకపోతే శిక్ష తప్పదని లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు.