పక్క పంచుకున్న లెక్కల టీచర్.. అరెస్టు చేసిన పోలీసులు

పక్క పంచుకున్న లెక్కల టీచర్.. అరెస్టు చేసిన పోలీసులు

UNITED KINGDOM: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు (గణితం టీచర్) తానే లెక్క తప్పి విద్యార్థులతో పక్కపంచుకుంది. కామవాంఛతో పాఠశాల బాలురపైనే కన్నేసి తన లైంగిక కోర్కెలె తీర్చుకుంది. ఒకరితోనే సరిపెట్టుకోకుండా, చాలామంది బాలురతో ఆమె పక్కపంచుకుంది. చివరికి గర్భం రావడంతో కథ అడ్డం తిరిగి, ఈ అక్రమ సంబంధం వివాదాస్పదమై కోర్టు వరకు వెళ్లింది. చివరికి ఆ టీచర్ జైలు పాలయ్యింది. బెయిల్ పై బయటకు వచ్చినా కూడా తన బుద్ధిని మార్చుకోకుండా మరో విద్యార్థిని లైన్ లో పెట్టింది. ఎంతో గౌరవ మర్యాదలు కలిగిన్న వృత్తిలో కొనసాగుతూ సమాజం సిగ్గుపడేలా వ్యవహరించిన ఈ టీచర్ ఉదంతం బ్రిటన్ లో ఆలస్యంగా వెలుచూసింది. ఆ టీచరమ్మ పేరు రెబక్కా జాయ్ నెస్. ముప్పయ్యేళ్ల వయసున్న ఆ టీచర్ 2021లో ఓ బాలుడికి ట్యూషన్ చెప్పింది. ఇందులో భాగంగా ఇద్దరి మధ్య బంధం బాగా క్లోజ్ అయ్యింది. తన ఫోన్ నెంబర్లో ఒక సంఖ్యను తక్కువగా చెప్పి కనుక్కోవాలని కూడా ఛాలెంజ్ చేసింది. అలా... అలా.. వీరిమధ్య సంబంధం మరింత దగ్గరయ్యింది. ఆ విద్యార్థిని షాపింగ్ కు తీసుకెళ్లి ఖరీదైన బెల్ట్, కావాల్సిన ఇతర వస్తువులు కొని ఇచ్చింది. ఇక, తర్వాత తన అపార్ట్ మెంట్ కు తీసుకెళ్లి లైంగిక అవసరాలు తీర్చుకుంది. ఈ ఘనకార్యాన్ని ఆ విద్యార్థి తన మిత్రులతో చెప్పగా, ఆ నోటా ఈనోటా పడి చివరికి మళ్లీ పోలీసులకు చేరింది. వెంటనే పోలీసులు మళ్లీ శోధన మొదలు పెట్టి, జాయ్ నెస్ ను అరెస్టు చేసి తిరిగి జైలుకు పంపించారు.