ఏకలవ్య ఆశ్రమంలో భోజనం పంపిణీ

ఏకలవ్య ఆశ్రమంలో భోజనం పంపిణీ

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : గోదావరి రోడ్ లోని ఏకలవ్య ఆశ్రమంలో ఎకీరాల సారిక తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల మధ్య నాలుగు గోడలలో పుట్టినరోజు వేడుకలు జరుకోవడంకంటే నిరుపేద విద్యార్థుల సమక్షంలో జరుకోవడం ఆనందంగా ఉంటుందని భావించిన సారిక తల్లితండ్రులు విజయలక్ష్మి, ప్రసాద్ లను ఒప్పించారు.

కూతురు కోరిక హర్షదాయకంగా ఉండడంతో ఏకలవ్య ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి వారికి మధ్యాహ్న భోజనం, స్వీట్ లు  పంపిణీ చేశారు. ఈసందర్భంగా తండ్రి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల మధ్య కూతురు సారిక పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.