రాష్ర్టంలో ఐటి రంగాన్ని అభివృద్ధి పర్చడమే లక్ష్యం

రాష్ర్టంలో ఐటి రంగాన్ని అభివృద్ధి పర్చడమే లక్ష్యం

దావోస్ లో త్రీసీస్ కంపెనీ సిఇఓ ఫ్రాన్జీతో మెదక్ ఎమ్మెల్యే: మైనంపల్లి రోహిత్

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ రాష్ర్టంలో ఐటి రంగాన్ని మరింతగా అభివృద్ధి పర్చడమే లక్ష్యం దిశగా దావోస్ కు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి, శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్బంగా బుధవారం వారిని ఎమ్మెల్యే కలిశారు. దావోస్ లో ప్రపంచ ఎకానమిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.

తెలంగాణ రాష్ర్టంలో భారీగా పెట్టుబడులు తెచ్చేలా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ తెలిపారు. ఈ సందర్భంగా త్రీ సీస్ కంపెనీ సి.ఇ.ఓ. ఫ్రాన్జితో ఎమ్మెల్యే పెట్టుబడులపై చర్చించారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ రివోల్యూషన్ స్పెస్, ప్యూచర్ టెక్నాలజీపై సదస్సులో ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మాట్లాడారు.