కాచవాని సింగారంలో మెగా వైద్య శిబిరం

కాచవాని సింగారంలో  మెగా వైద్య శిబిరం

 400 మందికి వైద్య పరీక్షలు

హైదరాబాద్: వైద్యాన్ని పేదల ముంగిట్లోకి తేవాలన్న లక్ష్యంతో శ్రీరామానుజ సేవాట్రస్ట్ రంగారెడ్డి జిల్లా కాచవాని సింగారం గ్రామంలో ఆదివారం నాడు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరానికి కాచవాని సింగారం మరియు ప్రతాప్ సింగారం గ్రామాలకు చెందిన నాలుగు వందల మంది ఆరోగ్య సమస్యలున్నవారు వచ్చారు. ఈ క్యాంప్ కి ప్రజలనుండి విశేష స్పందన లభించింది. ఇది శ్రీరామానుజ సేవాట్రస్ట్ ఏర్పాటు చేసిన 37 వ ఉచిత వైద్య శిబిరం. అన్ని స్పెషాలిటీ విభాగాలకు సంబంధించిన ప్రముఖ వైద్యులు ఈ శిబిరంలో తమ సేవలు అందించారు. 

ఆరోగ్య సమస్యలున్న వారికి అవసరమైన  ఖరీదైన రక్తపరీక్షలు, ఇసిజి, 2-డి ఎకో, ఫైబ్రోస్కాన్, ఎముకల పరీక్షలతో పాటు గుండె, కాన్సర్, కడుపు, ఛాతి, కంటి పరీక్షలు అనుభవఙ్ఞులచే  పూర్తి ఉచితంగా నిర్వహించామని ట్రస్టు వైస్ చైర్మన్ గోవర్ధన్ కౌశల్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్జరీలు అవసరమైన కొందరికి ప్రముఖ ఆస్పత్రులతో సంప్రదించి ఉచితంగా నిర్వహించే ఏర్పాటు కూడా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్థానిక రాజకీయ ప్రముఖులు భద్రారెడ్డి, ఉభయ గ్రామాల సర్పంచులు, పార్టీలకు అతీతంగా అనేకమంది హాజరయ్యారు.