చిరంజీవి ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం..
చిరంజీవికి మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ)IIFA Utsavam 2024 అవార్డ్స్ 2024 వేడుకల్లో చిరు 'ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' పురస్కారం అందుకున్నారు. ఇదే వేడుకలో నటసింహం నందమూరి బాలకృష్ణ కు ప్రతిష్టాత్మక 'గోల్డెన్ లెగసీ' అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక స్టార్ట్ హీరోయిన్ సమంత 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు అందుకోగా.. నానికి ఉత్తమ నటుడు అవార్డు వరించింది. 'మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారం దక్కించింది. ఈ వేడుకలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నటీనటులు పలు జాబితాల్లో అవార్డులు దక్కించుకున్నారు. ఈ ఈవెంట్ లో టాలీవుడ్ హీరోలు వెంకటేశ్, బాలకృష్ణ, దగ్గుపాటి రాణా, సుశాంత్, ఇతర నటీనటులు సందడి చేశారు.