కరీంనగర్ కవి సమ్మేళనానికి సాహితీ మేఖల సభ్యులు

కరీంనగర్ కవి సమ్మేళనానికి సాహితీ మేఖల సభ్యులు

చండూరు,  ముద్ర:కరీంనగర్ లోని ప్రముఖ సాహితీ సంస్థ  భవాని సాహిత్య వేదిక  ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయస్థాయి శతాధిక కవి సమ్మేళనానికి చండూరు సాహితీ మేఖలకు చెందిన సభ్యులు ఎంపికయ్యారు. ప్రముఖ కవి,రచయిత డా,వైరాగ్యం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. చండూరు మున్సిపాలిటీ పరిధికి చెందిన తెలుగు భాషోపాధ్యాయులు మద్దోజు వేంకట సుధీర్ బాబు,డాక్టర్ ఐ.సచ్చిదానందం, డాక్టర్ ఐ.నిర్మలానందం, డాక్టర్ చిదానందం లు ఎంపికయ్యారు.నవంబర్ 5న ఆదివారం కరీంనగర్ లో జరిగే కవి సమ్మేళనం లో పాల్గొని వారు తమ కవితలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా చండూరు మున్సిపాలిటీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, సాహితీ మేఖల సంస్థ అధ్యక్ష కార్యదర్శులు అంబడిపూడి సుబ్రమణ్య శాస్త్రి,పున్న అంజయ్య, సాహితీ మేఖల వ్యవహర్త మంచుకొండ చిన్న బిక్షమయ్య, చండూరు పట్టణానికి చెందిన ప్రముఖులు కోడి వెంకన్న, డా,కోడి శ్రీనివాసులు, పోలోజు నరసింహ చారి, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు పలువురు అభినందనలు తెలియజేశారు.